సౌదీలో దారుణం.. ఇండియన్ ని కిరాతకంగా చంపిన పాకిస్తానీ..!!

వాస్తవం ప్రతినిధి: కేరళ రాష్ట్రం మలప్పురంలోని కూట్టిలంగడికి చెందిన అబ్దుల్ అజీజ్‌ అనే వ్యక్తిని.. పాకిస్తాన్ కు చెందిన మరో వ్యక్తి అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. పాక్ వ్యక్తి అజీజ్‌పై విచక్షణరహితంగా కత్తితో దాడికి పాల్పడినట్టు తోటి కార్మికులు జెడ్డా పోలీసులకు తెలిపారు. వ్యక్తిగత ఘర్షణలో భాగంగానే పాక్ వ్యక్తి అజీజ్‌పై విచక్షణరహితంగా కత్తితో దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అజీజ్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.