వాస్తవం ప్రతినిధి: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో పంజాబ్ రైతులు తెలుపుతున్న నిరసనలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం గురునానక్ 551వ జయంతి సందర్భంగా ఆయన కెనడా ఎంపీ బర్దీష్ చగ్గర్ ఏర్పాటు చేసిన ఫేస్బుక్ వీడియో ఇంటరాక్షన్లో మాట్లాడుతూ.. ఇండియాలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని అన్నారు.శాంతియుత నిరసనలకు కెనడా ఎప్పుడూ మద్దతు తెలుపుతుందని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి అని చెప్పుకొచ్చారు. దేశ రాజధానిలో పంజాబ్ రైతుల అంశంపై మా ఆందోళన వ్యక్తం చేయడానికి భారత అధికారులతో సంప్రదిస్తున్నాం అని ట్రూడో వెల్లడించారు.