ఖచ్చితంగా ప్రభాస్ తో సినిమా చేస్తా అంటున్న రాజమౌళి..!!

వాస్తవం సినిమా: “బాహుబలి” సినిమాతో రాజమౌళి పేరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమ్రోగింది. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని సినిమాల రికార్డులను తిరగరాసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఒక్క భారతీయ చలన చిత్ర రంగానికి మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులకు బాహుబలి తో తానేంటో నిరూపించుకున్నాడు రాజమౌళి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ అదేవిధంగా చరణ్ తో కలిసి “ఆర్ఆర్ఆర్” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయిన వెంటనే మహేష్ తో సినిమా చేయనున్నట్లు రాజమౌళి గతంలోనే క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళికి ఓ ప్రశ్న ఎదురైంది. అది ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేస్తారా అని అడుగగా. దానికి రాజమౌళి ‘వామ్మో..మళ్లీ ప్రభాస్‌తోనా. ఇప్పటికే బాహుబలి ఐదు సంవత్సారాలు చేశా. మళ్లీ అంటే జనాలు తలలు పట్టుకుంటార’ని అన్నారు. వెంటనే నవ్వుతూ అవి సరదాగా అన్నాను. ఓ మంచి కథ దొరికితే కచ్చితంగా ప్రభాస్‌తో మరో సినిమా చేస్తా. ప్రభాస్‌తో చేయడం నాకూ ఇష్టమే అన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు.. మరో బాహుబలి ఇవ్వాలని రాజమౌళి ఇచ్చిన ఆన్సర్ కి సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.