అరుదైన గౌరవం దక్కించుకున్న ఎ.ఆర్.రెహమాన్..!!

వాస్తవం సినిమా: ఇండియన్ సంగీత ప్రియులకు ఏ ఆర్ రెహమాన్ పేరు తెలియనివారు ఉండరు. ఆస్కార్ అవార్డు గెలవడమే కాక ఇండియన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా రెహమాన్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కే పెద్ద సినిమాలకు చాలా వరకూ డైరెక్టర్లు ఏ ఆర్ రెహమాన్ నే ప్రిఫర్ చేస్తారు. అంత డిమాండ్ రెహమాన్ మ్యూజిక్ కి ఉంది. అటువంటి రెహమాన్ తన కెరీర్లో అనేక అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా ప్రతిష్టాత్మక బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్(బాఫ్టా) వారు రెహమాన్ కు అరుదైన హోదాను కట్టబెట్టారు. వారు బ్రేక్ థ్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా రహమాన్ ను నియమించడం జరిగింది. బ్రిటీష్ అధికారిక సంస్థ అయిన బాఫ్టా వారి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ట్యాలెంట్ ను గుర్తించే బాధ్యత ఈయనకు అప్పగించడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ తో కలిసి జ్యూరీ మెంబర్స్ సినిమా.. క్రీడా.. టెలివిజన్ రంగాల్లో ప్రతిభ కనబర్చే ఔత్సాహికులను గుర్తించనున్నారు. బ్రిటీష్ ప్రభుత్వం నుండి వారికి పురష్కారాలు కూడా అందనున్నాయి. ఆ జ్యూరీలో ప్రముఖులు హేమా హేమీలు ఉన్నారు. అలాంటి జ్యూరీలో రహమాన్ కు ఛాన్స్ దక్కింది. ఈ సందర్భంగా రెహ్మాన్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భారతీయులు గర్వించేలా అంతర్జాతీయ వేదికైన బాఫ్టాకు సేవలందిస్తానంటూ పేర్కొన్నాడు.