నాకు మొదటిసారి ఇలా అవమానం జరిగింది.. చంద్రబాబు భావోద్వేగం!

వాస్తవం ప్రతినిధి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నాయకులు చంద్రబాబునాయుడు కోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన పరిణామాలపై తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మీరు ఏ ముహుర్తాన ఓటేశారో తెలియదు గానీ, మీ కోసం జీవితంలో ఎన్నడూ లేని అవమానాలు ఎదుర్కొన్నానని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు భావోద్వేగం వ్యక్తపరిచారు. అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవితంలో ఎంతో మంది సీఎంలను చూశానని, ఫస్ట్‌ టైం ఓ ఫేక్ సీఎంను చూస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపించారు.

అసెంబ్లీకి సీఎం జగన్ ఆలస్యంగా వచ్చారని, ఆయన కోసం సమావేశాలను ప్రారంభించలేదని చంద్రబాబు చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతుంటే జగన్ మాట్లాడిన తీరుపై విమర్శించారు. పద్దతులు, ప్రజాస్వామ్యం అంటే తెలియదని, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలని అధికార వైసీపీకి చంద్రబాబు తెలిపారు.

సభలో వైసీపీ సభ్యులు మాటలపై ఆరోపించారు. ఈ ఏడాదిన్నరలో ఏడుసార్లు వరదలు వచ్చాయి. ఈ ఏడాది రూ.1,300 కోట్లు కట్టి ఉంటే కనీసం రూ. 3- 4 వేల కోట్ల ఇన్సూరెన్స్‌ రైతులకు వచ్చేది. ఉన్న వ్యవస్థను కుప్ప కూల్చి కొత్త వ్యవస్థ తెస్తామంటూ ఉత్తి మాటలు చెబుతున్నారు. నా జీవితంలో తొలిసారి స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లా.నాకు మొదటిసారి ఇలా అవమానం జరిగిద్మి. మమ్మల్ని సస్పెండ్‌ చేస్తారా? మీరు చెప్పిందల్లా ప్రజలు నమ్ముతారా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు.