వాస్తవం ప్రతినిధి: అమెరికా లో జరిగిన ఎన్నికల పై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల్లో మోసం జరిగినట్టు తన దగ్గర చాలా సమాచారం ఉన్నట్టు జైర్ బొల్సొనారో చెప్పుకొచ్చారు. ఇక బ్రెజిల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్‌పై కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు. బ్రెజిల్ ఎన్నికల్లో కూడా మోసం జరిగే అవకాశముందని, 2022 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పేపర్ బ్యాలెట్ సిస్టమ్ అమలు చేయాలన్నారు. బైడెన్ గెలుపును అంగీకరిస్తారా అని ఆయనను మీడియా ప్రశ్నించగా.. మరికొంతకాలం వేచి చూస్తానంటూ సమాధానమిచ్చారు.
Home అంతర్జాతీయ వాస్తవాలు అమెరికా ఎన్నికల్లో మోసం జరిగినట్టు నా దగ్గర చాలా సమాచారం ఉంది : బ్రెజిల్ అధ్యక్షుడు...