పెంపుడు కుక్కతో ఆడుకుంటుండగా.. జో బైడెన్ కు‌ స్వల్ప అస్వస్థత..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాట్‌ జో బైడెన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న సమయంలో ఆయన తూలి కిందపడోయారు. ఈ ఘటన తాజాగా వాషింగ్‌టన్‌లో చోటుచేసుకుంది. జోబైడెన్ కు తన పెంపుడు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఇందుకోసం జర్మన్ షెపర్డ్ డగ్స్‌ను పెంచుకుటున్నారు. అయితే, ఉదయం జాగింగ్ సమయంలో తానూ పెంచుకుంటున్న జర్మన్ షెపర్డ్ జాగిలంతో ఆడుకుంటుండగా జారి పడటంతో చీలమండకు గాయమైంది. దీంతో కుడిపాదం బెణికిన కారణంగా నడవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారని బైడెన్‌ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ఆదివారం ఆర్థోపెడిస్ట్‌ను సంప్రదించి ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ చేయించగా, స్వల్పంగా ఫాక్చర్‌ అయినట్లు తేలిందని పేర్కొంది.