దేశంలోనే అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా..??

వాస్తవం సినిమా: బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు హీరోయిన్లు అయిన అమితాబచ్చన్, రణ్ బీర్ కపూర్.. ఆలియా భట్ నటిస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఈ సినిమాకి సంబంధించి బాలీవుడ్ మీడియా వర్గాలలో అనేక వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ గురించి జాతీయ మీడియాలో ఆసక్తికర కథనం ప్రసారమయింది. మేటర్ ఏమిటంటే బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమా బడ్జెట్ దేశంలో ఏ సినిమాకు చేయని ఈ విధంగా ఈ సినిమాకి ఖర్చు చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

మొత్తంమీద చూసుకుంటే సాహో మరియు బాహుబలిని మించిన బడ్జెట్ తో బ్రహ్మస్త్ర ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 300 కోట్లకు పైగానే ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. డిస్నీ సంస్థ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మరి కొన్నాళ్లకు పూర్తి అవ్వబోతుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.