“లూసిఫర్‌” ప్రాజెక్టు విషయంలో చిరంజీవి కీలక నిర్ణయం..??

వాస్తవం సినిమా: మలయాళం ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన “లూసిఫర్‌” సినిమా హక్కులను తెలుగులో రామ్ చరణ్ నిర్మాణ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి దర్శకత్వ బాధ్యతలను ఎవరికి ఇవ్వాలి అనే దాని విషయంలో చిరంజీవి మల్లగుల్లాలు పడుతున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మొదటిలో ఈ సినిమాని “సాహో” సినిమా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ స్క్రిప్టు విషయంలో చిరంజీవి సంతృప్తి చెందకపోవడంతో సుజిత్ ని పక్కన పెట్టేశారు. ఇదే తరుణంలో వివి వినాయక్, బాబీ పేర్లు వినపడ్డాయి అయితే వీళ్ళు కూడా స్క్రిప్ట్ విషయంలో గుర్తించ లేక పోవటం తో వాళ్లను కూడా పక్కన పెట్టడం జరిగింది.

ఈ తరుణంలో మెహర్ రమేష్ పేరు వినిపించగా ఆయన కూడా సరిగ్గా స్క్రిప్ట్ తెలుగు నేటివిటీకి మార్చడానికి అష్టకష్టాలు పడుతున్నట్లు తెలియగా ఇప్పుడు తాజాగా “లూసిఫర్‌” ప్రాజెక్టు కోసం మరో కొత్త డైరెక్టర్ ని వెతికే పనిలో మెగా కాంపౌండ్ లో ఉన్నట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.

ఇదిలా ఉంటే కొరటాల దర్శకత్వంలో చేస్తున్న “ఆచార్య” సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవటంతో, నెక్స్ట్ “లూసిఫర్‌” ప్రాజెక్టును పట్టా లెక్కించి త్వరత్వరగా కంప్లీట్ చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు టాక్.