బాలీవుడ్ హీరో టైటిల్ తో నాగశౌర్య సినిమా..??

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలు నాగ శౌర్య మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. “ఊహలు గుసగుసలాడే” సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శౌర్య డిఫరెంట్ సబ్జెక్ట్ కలిగిన సినిమాలతో ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉన్నాడు.

ఇదిలా ఉండగా నాగ శౌర్య ఆర్చరీ క్రిడా నేపథ్యంలో సరి కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా సంతోష జాగర్లమూడి పని చేస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది.

ఫుల్ వర్క్ ఔట్ తో నాగశౌర్య ఈ సినిమా కోసం తన బాడీ షేపు మార్చుకోవటం జరిగింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేశారు. సినిమాకి “లక్ష్య” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. గతంలో ఇదే టైటిల్ తో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ హిట్ అయింది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో గోపీచంద్ కూడా లక్ష్యం అనే సినిమా చేసి విజయం సాధించారు. మరి నాగ శౌర్య లక్ష్య ఏ మాత్రం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.