“పుష్ప” సినిమా పై వచ్చిన రూమర్ పై క్లారిటీ ఇచ్చిన సినిమా యూనిట్..??

వాస్తవం సినిమా: డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా “పుష్ప” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

“అల వైకుంఠపురం లో” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొనసాగింపు ఉండేలా సినిమా కోసం బన్నీ భారీ స్థాయిలో కష్టపడుతున్నాడట. ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాలకు సంబంధించిన యాస తో బన్నీ డైలాగులు ఈ సినిమాలో ఉంటాయని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గుబురు గడ్డంతో పాటు బాగా జూట్టు పెంచిన బన్నీ.. తన మేకోవర్ చాలావరకు మార్చుకున్నాడు.

ఇదిలా ఉండగా గతంలో సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన సినిమాలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కలిగిన సినిమాలు కావటంతో.. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు అభిమానులు.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఇటీవల ఓ రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే సినిమాలో విలన్ పాత్రలో విక్రమ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వచ్చిన ఈ వార్తల్లో వాస్తవం లేదని ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది.