వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. దుండగుడి దాడి నుంచి ఆయన అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు.
మచిలీపట్నంలోని ఇవాళ ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి మంత్రి కాళ్లకు దండం పెట్టినట్టు నటిస్తూ పదునైన తాపీతో దాడికి తెగబడ్డాడు.
వెనువెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు అతడిని పట్టుకున్నారు. ఆ వ్యక్తిని తాపీ మేస్త్రీ నాగేశ్వరరావుగా గుర్తించిన మంత్రి అనుచరులు.. పోలీసులకు అప్పగించారు.