ప్రపంచం గర్వించే నాయకుడిగా బైడెన్‌.. కమల హారిస్ ప్రశంసల వర్షం..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌పై ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ అత్యుత్తమ అధ్యక్షుడిగా ప్రపంచం గర్వించే నాయకుడిగా ఉంటారని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు. “జో బైడెన్ అమెరికా అత్యుత్తమ అధ్యక్షుడిగా ఉంటారు. ప్రపంచం ఆయనను గౌరవిస్తుంది. భవిష్యత్తు తరాలవారు దాన్ని చూస్తారు” అంటూ కమలా హారిస్ ట్వీట్ చేశారు.