“నాట్స్” మరో ముందడుగు.. థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఆహార పంపిణీ..!!

వాస్తవం ప్రతినిధి: “ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అంటూ ఖండాంతరాలు దాటినను అమెరికాలో వున్న తెలుగు వారందరిని ఏకం చేస్తూ.. మన భారతీయ సంస్కృతిని గుర్తు చేసుకుంటూ ప్రతి యేటా చేసే వేడుకలు భావి తరాలు గుర్తుంచుకునేలా చేస్తోంది “నాట్స్”. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆవిర్భవించినప్పటి నుండి “భాషే రమ్యం, సేవే గమ్యం” దిశగా పయనిస్తూ… భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, ప్రతి యేటా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది “నాట్స్” అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకెళ్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తన నినాదానికి తగ్గట్టుగా అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. థ్యాంక్స్ గివింగ్ డేను పురస్కరించుకుని తాజాగా స్థానికులకు ఆహార పంపిణీ చేసింది. ఐటీ సర్వ్ అలయన్స్ ఫ్లోరిడా విభాగం, బటర్ ప్లై ఫార్మసీ, అవెర్‌నెస్ యూఎస్‌ఏ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. డాక్టర్ రమ్య పిన్నమనేని, డాక్టర్ విజయ్ ఫణి దలయ్, సోమంచి కుటుంబ, డాక్టర్ సుదర్శన్, రమ కామిశెట్టి ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయాన్ని అందించారు. కాగా.. కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వారు నాట్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.