వాస్తవం ప్రతినిధి: కుటుంబ పార్టీ అని టీఆర్ఎస్ను కేంద్రమంత్రులు విమర్శిస్తున్నారని, బీజేపీ మాత్రం కుటుంబ రాజకీయాలకు అతీతమా అని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలో యాడ్యురప్ప కుమారుడు, రాజస్థాన్‌లో వసుందర రాజే, దుష్యంత్, మధ్యప్రదేశ్‌లో విజయరాజే, యశోధరా, జ్యోతిరాదిత్య, ఢిల్లీలో మేనక గాంధీ, వరుణ్ గాంధీ లేరా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి కుటుంబం లేదు కాబట్టి ఆయనది వేరే విషయం అని పేర్కొన్నారు.గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన కేటీఆర్..
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజైన డిసెంబర్ 1న విద్యావంతులు కాస్సేపు ఫేస్బుక్ లో కామెంట్లు కాస్త ఆపి పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేయండి. టీఆర్ఎస్కు నచ్చకపోతే నోటాకు అయినా వేయండి అంటూ సూచించారు.
వరదలొస్తే నీట మునగని నగరాలు ఉన్నాయా? ముంబై, చెన్నై, బెంగళూరు, పట్నాలో అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంటోంది.. పట్నాలో వరదలొచ్చినప్పుడు బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీని పడవలో తీసుకురలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. నగరంలో మజ్లిస్, బీజేపీలు అలజడులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని.. ఇది తమ పార్టీ వాళ్లకూ వర్తిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.