ఆయన నోరు కలుషితమైన మూసీ నది కంటే డేంజర్…: బండి సంజయ్

వాస్తవం ప్రతినిధి: మొట్టమొదటిసారిగా దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలిచి తెరాస ఓడిపోయినందుకు దుబ్బాక ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా సంతోషిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

కెసిఆర్ పాలనపై విమర్శించిన సంజయ్ తాజాగా కెసిఆర్ నిన్న జరిపిన బహిరంగ సభపై స్పందించారు. కెసిఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఫ్లాప్ షోగా బండి సంజయ్ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఏమీ చేయడం లేదని జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని బిజెపి భయపడుతోందని కెసిఆర్ చేసిన ప్రకటనను బండి సంజయ్ తీవ్రంగా తిప్పికొట్టారు.

బండి సంజయ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో వెంటనే ఏమి చేయాలంటే ముందుగా కెసిఆర్ అపరిశుభ్రమైన నోరును శుభ్రం చేయాలి. ఆయన నోరు కలుషితమైన మూసీ నది కంటే డేంజర్. రాష్ట్ర అభివృద్ధిపై కెసిఆర్ కెటిఆర్ లు ఏమాట్లాడకుండా అబద్ధాలు చెబుతున్నారు. నిధులు మింగేస్తున్నారని విమర్శించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం జంట నగరాల్లోని ప్రజలకు వరదల నుంచి రక్షణకు లేకుండా చేసిందని ఆరోపించారు.. ప్రజల కోసం ఏమీ చేయకుండా కెసిఆర్ మరియు టిఆర్ఎస్ మరోసారి ఓటర్లకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుండటం దురదృష్టకరమన్నారు.