NRI నాన్ ప్రాఫిట్ సంస్థలకు రాజకీయ పార్టీలతో అనుబంధం చట్ట వ్యతిరేకం

వాస్తవం ప్రతినిధి: నాన్ ప్రాఫిట్ సంస్థ అంటే ఆ సంస్థ యొక్క ఆదాయం కోసం పనిచేస్తూ ఆ ఆదాయాన్ని ప్రజా లేదా సామాజిక కార్యక్రమాల కోసం ఉపయోగించే సంస్థ. ముఖ్యంగా ఈ నాన్ ప్రాఫిట్ సంస్థలు తమ ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఈ ఆదాయాన్ని ప్రైవేట్ సంస్థలకు ఉపయోగించరాదు. ఈ జాబితాలో చాలా పాఠశాలలు, మత సంఘాలు, కుల సంఘాలు, సామాజిక క్లబ్‌లు మరియు వినియోగదారుల సహకార సంస్థలు ఉంటాయి. ఈ సంస్థలు సాధారణంగా పన్ను మినహాయింపు కోసం ప్రభుత్వాల నుండి అనుమతి తీసుకుంటాయి. ఈ సంస్థలు విరాళాల ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందుతూ ఎటువంటి లాభాలను ఆశించకుండా సంస్థ యొక్క గమ్యం పై దృష్టి పెడతాయి. అటువంటి సంస్థల పైనే ప్రజల విశ్వాసం ఉంటుంది మరియు ఫలితంగా సంస్థకు ఎక్కువ విరాళాల అందుతాయి.

నేషనల్ సెంటర్ ఫర్ ఛారిటబుల్ స్టాటిస్టిక్స్ ప్రకారం, ఆమెరికాలో ఇప్పటివరకు 1.5 మిలియన్లకు పైగా ప్రజా ధార్మిక సంస్థలు, ప్రైవేట్ ఫౌండేషన్లు మరియు ఇతర నాన్ ప్రాఫిట్ సంస్థలు నమోదు చేయబడ్డాయి. ఈ సంఖ్యలో కొన్ని ఎన్నారై నాన్ ప్రాఫిట్ సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే ఈ సంస్థలోని కొన్ని ఎన్నారై నాన్ ప్రాఫిట్ సంస్థలకు భారత రాజకీయ పార్టీలతో అనుబంధాలు ఉన్నాయి మరియు రాజకీయ ప్రచార కార్యకలాపాల్లో కూడా పాల్గొంటున్నాయి. నిజానికి ఇలా చేయడం చట్ట రిత్య నేరం. సెక్షన్ 501 (సి) (3) కింద ఒక సంస్థ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా “రాజకీయ పార్టీ తరపున ఏదైనా రాజకీయ ప్రచారంలో పాల్గొనకూడదు, మరియు జోక్యం చేసుకోకూడదు. ఒక వేళ ఎదైన సంస్ధ ఇది ఉల్లంఘిస్తే పన్ను మినహాయింపు స్థితిని రద్దు చేయవచ్చు మరియు కొన్ని ఎక్సైజ్ పన్నులు విధించవచ్చు. నిషేధిత రాజకీయ కార్యకలాపాలలో రాజకీయ పార్టీ లేదా అభ్యర్థికి విరాళాలు ఇవ్వడం మరియు సంస్థ పేరిట అభ్యర్థి తరపున ప్రకటనలు చేయడం నిషేధం.