దుబాయిలో ఇండియన్ మిస్సింగ్..!

వాస్తవం ప్రతినిధి: తమిళనాడుకు చెందిన అమృతలింగం (46) ఉద్యోగం కోసం మరో నలుగురితో కలిసి నవంబర్ ఎనిమిదో తేదీన దుబాయి వెళ్లాడు. హోర్ అల్ ఆంజ్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో నలుగురు బస చేశారు. మరుసటి రోజు ఉదయం అమృతలింగం ఉద్యోగానికి వెళ్లి తిరిగి రాగా.. మిగతా ముగ్గురు నైట్ షిఫ్ట్‌కు వెళ్లారు. వారు ముగ్గురు రూంకు తిరిగి వచ్చేసరికి అమృతలింగం అదృశ్యమయ్యాడు. రూంలోని ఓ వ్యక్తి బంధువు దుబాయిలోనే నివసిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు వారాలైనా అమృతలింగం ఆచూకీ దొరకకపోవడంతో.. అతడి కుటుంబం ట్విటర్ ద్వారా దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించింది. విషయం తెలుసుకున్న కాన్సులేట్ అధికారులు అమృతలింగంను వెతికే పనిలో పడ్డారు.