మైదానంలో బుట్ట బొమ్మ పాటకు డ్యాన్స్‌ చేసి సంద‌డి చేసిన వార్నర్

వాస్తవం ప్రతినిధి: బన్నీ..త్రివిక్రమ్ ల అల వైకుంఠపురములో సినిమా పాటలు ఒక రేంజిలో హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలోని బుట్ట బొమ్మ పాట అయితే.. ఆడియో ఎంత హిట్ అయిందో దానిని మించి బన్నీ..పూజా హేగ్దెల స్టెప్పులు హిట్ అయ్యాయి. ఆ ఒక్క పాటే యుట్యూబ్ లో 450 మిలియన్ల వ్యూస్ తొ రికార్డు సృష్టించింది. ఇక ఈ పాట టిక్ టాక్ లో అయితే ఎంత క్రేజీ పాటో చెప్పక్కర్లేదు.

ప్ర‌స్తుతం భార‌త్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌ల‌తో బిజీగా ఉన్నాడు వార్న‌ర్. నిన్న భార‌త్- ఆసీస్ మ‌ధ్య తొలి వ‌న్డే జ‌ర‌గ‌గా, ఆ మ్యాచ్‌లో వార్న‌ర్ అర్ధ సెంచ‌రీ చేసాడు. బ్యాట్‌ని ఝుళిపిస్తూ ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసిన వార్న‌ర్ డ్యాన్స్‌తోను సంద‌డి చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న స‌మయంలో ఆడియ‌న్స్ బుట్ట‌బొమ్మ బుట్ట‌బొమ్మ అంటూ కేక‌లు వేస్తుండ‌గా, బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర నిలుచొన్న వార్న‌ర్ బుట్ట‌బొమ్మ సాంగ్‌కు త‌న‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేశాడు. దీంతో వీక్ష‌కులు తెగ గోల చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.