ఆ నేతల విషయంలో అప్రమత్తం అవుతున్న తెలంగాణ పోలీస్ శాఖ

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయకూడదని ముందునుంచే పోలీస్ శాఖ చెప్పుకొస్తూ ఉంది. నగరంలో గొడవలు సృష్టించడానికి అల్లరిమూకలు రెడీ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుండి సమాచారం అందినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఎంతటివారైనా తెలంగాణ పోలీస్ శాఖ విడిచి పెట్టడం లేదు. ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అదేవిధంగా ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న అబియోగాలపై ఇద్దరు నేతలపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో చాలా వరకు బీజేపీ నేతలు అదేవిధంగా ఎంఐఎం పార్టీ నాయకులు తెలంగాణ పోలీస్ శాఖ తాజాగా ఫైల్ చేసిన కేసులతో కొద్దిగా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

మరోపక్క గ్రేటర్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో బిజెపి పార్టీకి చెందిన కీలక నాయకులు.. గ్రేటర్ ప్రచారం కోసం బరిలోకి దిగుతున్నట్లు పార్టీలో టాక్ వస్తోంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చివరి రోజు పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ పై తీవ్రస్థాయిలో డైలాగులు వేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలలో టాక్.