వాస్తవం ప్రతినిధి: ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ ఎగెనెస్ట్ వుమెన్’ అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. మహిళలను జంతువులతో పోల్చి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నీవు కొట్టడానికి మహిళ జంతువు కాదు. మనందరం జంతుహింస తగదని చెప్తాం. వాటి మీద ఆప్యాయత కురిపిస్తాం.. జాలి చూపిస్తాం. మహిళలు పిల్లలు కూడా జంతువులే. అందులోనూ హక్కులున్న జంతువులు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బెంజమిన్. దీంతో మహిళల్ని జంతువులతో పోలుస్తావా అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.