భారతీయ ప్రవాసులపై ప్రశంసల జల్లు కురిపించిన డచ్ ప్రధాని..!!

వాస్తవం ప్రతినిధి: డచ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే భారతీయ ప్రవాసులపై ప్రశంసల జల్లు కురిపించారు. నెదర్లాండ్స్‌లోని భారత రాయబారి వేణు రాజమోనీకి రాసిన లేఖలో రుట్టే ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా భారత్, నెదర్లాండ్ మధ్య ఉన్న ఏడు దశాబ్దాల ద్వైపాక్షిక సంబంధం గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. నీరు, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనంతో సహా వివిధ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. “ఐరోపాలో భారతీయ ప్రవాసులు అధికంగా ఉండే దేశాల్లో నెదర్లాండ్స్ ఒకటి. వారి విజయాలు, మన సమాజానికి వారు చేసిన కృషి మాకేంతో గర్వకారణం. ఇండో-డచ్ ద్వైపాక్షిక సంబంధం మునుముందు కూడా ఇలాగే కొనసాగుతుందనే నమ్మకం మాకుంది.” అని ప్రధాని తన లేఖలో రాసుకొచ్చారు.