చాలా కాలం తర్వాత పోటీకి రెడీ అవుతున్న బాలయ్య -చిరంజీవి..??

వాస్తవం సినిమా: ఇండస్ట్రీలో ఒక సమయంలో బాలకృష్ణకి మరియు చిరంజీవి మధ్య పోటా పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉండేది. ఇద్దరు హీరోల అభిమానులు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన సమయంలో ఎవరికి వారు ప్రిస్టేజ్ గా తీసుకొని నానా హడావిడి చేసేవాళ్ళు. చాలా వరకూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్టుగా వాతావరణం ఉండేది. అదే మాదిరిగా ఒకే సారి కూడా ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అయిన పరిస్థితులు అప్పట్లో వచ్చేవి.

ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత మరొకసారి వీరిద్దరూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమా వచ్చే వేసవి కాలంలో రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంటుంది. కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఇటీవల మొదలవడం కూడా జరిగింది. దీంతో ఎలాగైనా వేసవికి సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

మరోపక్క బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ వుందట. అయితే ఇండస్ట్రీలో తాజాగా వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నట్లు టాక్ వస్తోంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అనే వాతావరణం నెలకొనడం గ్యారెంటీ అని నెటిజన్లు అంటున్నారు.