అల్లు అర్జున్ సినిమాలో విక్రమ్..!!

వాస్తవం సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో చేస్తున్న ఈ మూడో సినిమా కూడా అదే స్థాయిలో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే విధంగా సుకుమార్ సరికొత్త స్క్రిప్ట్ తో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో సౌత్ ఇండియా లో కీలక నటులు గా పేరొందిన విజయ్ సేతుపతి, ఉపేంద్ర, సుదీప్‌, ఆర్య వంటి వారిని సుకుమార్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా విలక్షణ నటుడు విక్రమ్‌ ను చిత్రయూనిట్‌ సంప్రదిస్తున్నట్లుగా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో నిజంగానే విక్రమ్‌ని తీసుకుంటే మాత్రం ‘పుష్ప’ రేంజ్ మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారేడుమిల్లి అరణ్యంలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా చేస్తోంది.