“వకీల్ సాబ్” రిలీజ్ సంక్రాంతికి కూడా కష్టమే..??

వాస్తవం సినిమా: “వకీల్ సాబ్” సినిమాతో పవన్ కళ్యాణ్ రి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల పాటు పవన్ రాజకీయాల్లో ఉండటంతో మాత్రమే కాక సినిమాలు చేయను అని అప్పట్లో తేల్చి చెప్పటంతో అభిమానులు ఫుల్ నిరుత్సాహం చెందారు.

అయితే చాలా వరకు రాజకీయ నేతలు ఒక పక్క వ్యాపారాలు చేస్తూనే మరో పక్క పార్టీలు నడిపించడం తో.. పవన్ కళ్యాణ్ ని కూడా ఆ విధంగానే సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాలు చేయాలని కోరడంతో పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. దీంతో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు కొద్ది నెలల్లోనే ముగించేశారు. ఇంతలోనే కరోనా రావడంతో ఈ సినిమా మే 15 న రిలీజ్ అవుతుంది అని అనుకున్న వారికి ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయ్యింది. సినిమా షూటింగ్ కొద్దిగా ఉన్న సమయంలో కరోనా లాక్డౌన్ దెబ్బకి వాయిదా పడటం జరిగింది. అయితే ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలై తరుణంలో సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్లు వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న శృతిహాసన్ వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడుతూ…జనవరి నుంచి వకీల్ సాబ్ షూటింగ్‌కి హాజరు కాబోతున్నానని తెలిపింది. పవన్‌తో మూడోసారి పనిచేస్తున్నా… వెరీ హ్యాపీ అని పేర్కొంటూ మెగా అభిమానుల్లో జోష్ నింపింది. అయితే శృతి ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో వకీల్ సాబ్ సినిమా సంక్రాంతి బరిలో ఉండదనే విషయం కన్ఫామ్ అయిందనే చెప్పుకోవాలి. ఇక మొత్తం బట్టి చూస్తే ఈ సినిమా వచ్చే సమ్మర్ కి రిలీజ్ అవుతున్నట్లు అర్థమవుతుంది.