మీరు ఆ పని చేస్తే..రెండు గంటల్లోనే దారుసలంని కూల్చేస్తాం..బండి సంజయ్‌

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్‌ పోరులో ఎంఐఎం, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కౌంటర్ ఇచ్చారు. ‘హిందువుల ఆరాధ్య దైవం అయిన పీవీ, ప్రజా నాయకుడు ఎన్టీఆర్‌ సమాధులు కూల్చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చితే.. రెండు గంటల్లోనే దారుసలంని కూల్చేస్తామని హెచ్చరించారు. దారుసలాంలో సౌండ్‌ చేస్తే ప్రగతి భవన్‌లో ఎందుకు రీసౌండ్‌ వస్తోందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ స్క్రిప్ట్‌ని దారుసలాంలో చదువుతున్నారని విమర్శించారు. భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే నల్ల జెండాలు పట్టుకున్న వారిపై సర్జికల్‌ స్ట్రైక్‌ ఎందుకు చేయకూడదనిని బండి సంజయ్‌ ప్రశ్నించారు.