శాంతి భద్రత విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు అంటున్న కేసీఆర్..!!

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల మధ్య మత గొడవలు సృష్టించడానికి కొన్ని అరాచక శక్తులు వచ్చినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల నుండి సమాచారం వచ్చినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పొలిటికల్ లీడర్లు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని మాట్లాడాలని కోరారు. మనుషుల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మతకల్లోలాలు సృష్టించే రీతిలో హైదరాబాద్ నగరంలో గొడవలు సృష్టిస్తే మాత్రం ఖబడ్దార్ అంటూ కేసీఆర్ హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఎలాంటి నాయకుడు అయినా గీత దాటి మాట్లాడితే ఊరుకో వద్దు అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులకు కేసిఆర్ ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘవిద్రోహ శక్తుల ఆటలు సాగనిచ్చేది లేదని తెలిపారు. నిరాశ నిస్పృహల్లో కొన్ని అరాచక శక్తులు అల్లర్లు సృష్టించే పనిలో ఉన్నాయని అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో భావోద్వేగాలు రెచ్చగొట్టి గొడవ రాజేసి.. ఎన్నికలలో లబ్ది పొందడానికి కొన్ని అరాచక శక్తులు రెడీ అవుతున్నాయని కచ్చితమైన సమాచారం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రశాంతమైన నగరంలో గొడవలు సృష్టిస్తే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయని కేసిఆర్ హెచ్చరించారు.