అమరావతి భూ కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!!

వాస్తవం ప్రతినిధి: అమరావతి రాజధాని భూములు విషయములో టిడిపి పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది అంటూ ముందు నుండి వైసిపి ఆరోపించడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి అయిన జగన్ అమరావతి పేరట జరిగిన కుంభకోణాన్ని గట్టిగా టార్గెట్ చేసి దానికి ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి అన్ని విషయాలను బయటకు లాగుతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ నివేదిక ప్రభుత్వానికి రావడంతో దాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ క్రమంలో అసలు అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్ట కూడదు అని హైకోర్టు స్టే ఇవ్వటం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా ఎపి హైకోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్ పై సుప్రింకోర్టు స్టే ఇచ్చింది. అమరావతి భూ కుంభకోణం కు సంబందించి మాజీ ఆడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ , మరో పదమూడు మంది పై ఎసిబి కేసు నమోదు చేయగా, దానిపై స్టే ఇవ్వడమే కాకుండా , ఆ వార్తను ప్రచారం చేయరాదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎపి ప్రభుత్వం సుప్రింకోర్టులో అప్పీల్ చేసింది. అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించి హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ప్రభుత్వం తరపున రాజీవ్ ధావన్ వాదిస్తూ అమరావతిలో భూమి కుంభకోణం జరిగితే కేసు దర్యాప్తు చేయరాదా? దానిని మీడియా కవర్ చేయరాదా అని ప్రశ్నించారు. ఒక్కరు మాత్రమే పిటిషన్ వేస్తే, మిగిలినవారికి కూడా హైకోర్టు ఆదేశాలు ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు.