ఇది ‘జగనన్న కబ్జా పథకం ‘అంటున్న టీడీపీ..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన “జగనన్న తోడు” పథకంపై టిడిపి నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టిడిపి పార్టీ కీలక నేత పట్టాభి రామ్ తాజాగా ఈ పథకం గురించి మీడియా సమావేశం నిర్వహించి షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ చేసేది గోరంత, చెప్పేది కొండత అంటూ సెటైర్స్ వేశారు. ప్రజల ముందు ఇదే విషయాన్ని సీఎం జగన్ పదే పదే చెప్తూ ఉంటారు అని తెలిపారు. అయితే ఇప్పుడు అదే కోవలోకి జగనన్న తోడు పథకం అంటూ పట్టాభి రామ్ విమర్శలు చేశారు. ఈ పథకాల ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వైసిపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది అంటూ ఆరోపించారు. ఇదిలా ఉంటే చిరు వ్యాపారాలు కోసం పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అంటూ ఒక పథకం గతంలోనే ప్రవేశపెట్టిందని ఇందులో పది వేల రూపాయల వరకూ ప్రజలు ఆర్థిక సహాయం పొందవచ్చు అంటూ పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రంగులు మార్చి జగన్ ప్రభుత్వం కబ్జా చేసింది అంటూ పట్టాభి రామ్ ఆరోపించారు. ఇది జగనన్న తోడు కాదు, జగనన్న కబ్జా పథకం అంటూ కామెంట్ చేస్తూ వడ్డీ తో సహా తిరిగి చెల్లించాల్సిన అప్పుకి అవసరమా ఇంత హంగామా అంటూ సెటైర్స్ వేశారు.