పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాల్సిందే: అక్బరుద్దీన్

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ ఎన్నికల వేళ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెంచేశారనే చెప్పాలి. ఎందుకంటే..నగరంలోని అక్రమ కట్టడాలను కూల్చేస్తామని అధికార పార్టీ నేతలంటున్నారని..అదే జరిగితే హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాల్సిందేనని డిమాండ్ చేశారు అక్బరుద్దీన్ .

4,700 ఎకరాలుండాల్సిన హుస్సేన్ సాగర్ ప్రస్తుతం 700 ఎకరాలు కూడా లేదని అక్బరుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు. మాయమాటలతో మళ్లీ గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు. గత ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని అక్బరుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు.

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇంతవరకూ ఎందుకివ్వలేదని ప్రశ్నించిన ఆయన..టీఆర్ఎస్ తోక ఎప్పుడు ఎలా తొక్కాలో తమకు తెలుసని స్పష్టం చేశారు.
మరోవైపు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు పట్ల టీడీపీ,బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.