గ్రేటర్ ఎన్నికల బరిలో 49 మంది నేరచరితులు..అత్యధికంగా ఆ పార్టీ వారేనట!

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో 49 మందికి నేర చరిత్ర ఉందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. ఈమేరకు నేరచరిత్ర కలిగిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

నేర చరిత్ర కలిగిన 49 మంది అభ్యర్థుల్లో బీజేపీ నుంచి అత్యధికంగా 17 మంది ఉన్నారని వివరించింది. అలాగే.. 13 మంది టీఆర్ఎస్, 12 మంది కాంగ్రెస్, ఏడుగురు మజ్లిస్ పార్టీల అభ్యర్థలకు నేర చరిత్ర ఉందని వెల్లడించింది.

గత గ్రేటర్ ఎన్నికల్లో నేర చరిత్ర కలిగిన 72 మంది పోటీ చేశారని గుర్తు చేసింది. నేర చరిత్ర లేని అభ్యర్థులకు ఓటు వేయాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ మేరకు పిలుపునిచ్చింది.

ఇక.. గ్రేటర్ ఎన్నికల బరిలో మొత్తం 1121 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.   టీఆర్ఎస్ నుంచి 150 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. టీడీపీ నుంచి 105 మంది పోటీలో నిలిచారు.