వాస్తవం ప్రతినిధి: ప్రపంచానికి కొత్త ఛాంపియన్ పుట్టుకొస్తున్నాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరాడు ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ అరుదైన ఘనతను సాధించారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన మస్క్.. సంపాదనలో మరో కుబేరుడు బిల్ గేట్స్‌ను దాటిపోయారు. 49 ఏళ్ల మస్క్ 127.9 బిలియన్ల ఆదాయంతో బిల్ గేట్స్‌ను అధిగమించి వరల్డ్ సెకండ్ రిచెస్ట్ పర్సన్‌గా నిలిచారు. ప్రస్తుతం మస్క్ నికర సంపద విలువ 127.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. బిల్ గేట్స్ ఆదాయం 127.7 బిలియన్ డాలర్లు. టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు, అంతరిక్ష యానం, సరికొత్త బ్యాటరీ కార్లు, హైపర్ లూప్ ప్రయాణం వంటి వ్యాపారాలతో లాభాల బాటలో దూసుకుపోతున్నాడు మస్క్.