బ్రిటన్‌లో తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం..!

వాస్తవం ప్రతినిధి: ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన హనుమంతరావు కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక బ్రిటన్ ఎన్‌హెచ్‌ఎస్ పార్లమెంటరీ జీవితసాఫల్య పురస్కారం దక్కించుకున్నారు. యూకేలో సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా వైద్యరంగంలో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆ దేశ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించింది. ఇక దేశవ్యాప్తంగా ఈ పురస్కారం కోసం 700 పైగా దరఖాస్తులు రాగా… తెలుగు వైద్యుడు ఘట్టమనేని ఎంపిక కావడం విశేషం. వచ్చే ఏడాది జూన్ 7న ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు.