బిగ్ బాస్ 4: హౌస్ లో సరికొత్త గేమ్ స్టార్ట్ చేసిన మోనల్..!!

వాస్తవం సినిమా: బిగ్ బాస్ సీజన్ ఫోర్ రియాల్టీ షో తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా వరకు గేమ్ చివరి దశకు చేరుకోవడంతో ఇంటిలో సరికొత్త వాతావరణం నెలకొంది. ఏడుగురు సభ్యులు మిగిలి ఉండటంతో ఎవరికి వారు టాప్ ఫైవ్ లో కి వెళ్లడానికి తెగ ఆరాటపడుతున్నారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే టాప్ ఫైవ్ లోకి జబర్దస్త్ కంటెస్టెంట్ అవినాష్ వెళ్ళిపోయినట్లే అనే టాక్ వస్తోంది. ఇదిలా ఉండగా మరోపక్క మోనాల్ మరోసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీ హౌస్ లో స్టార్ట్ చేసింది అనే టాక్ వస్తోంది. మేటర్ లోకి వెళ్తే మళ్లీ అభిజిత్, అఖిల్ తో క్లోజ్ గా మూవ్ అవడం తో…. గేమ్ చివరికి వచ్చేసరికి మోనాల్ సరి కొత్త స్ట్రాటజీ వేసినట్లు జనాలు భావిస్తున్నారు. వీళ్ళిద్దరికీ క్లోజ్ అవుతూ షో కి మంచి హైప్ క్రియేట్ చేయడానికి, ఫోకస్ మొత్తం తనపై పెట్టుకోవడానికి మోనాల్ మళ్లీ ఇద్దరితో మాట్లాడుతున్నట్లు తాజాగా ఆమె వ్యవహరిస్తున్న తీరుపై బయట జనాలు తెగ చర్చించుకుంటున్నారు.