బిగ్ బాస్ హౌస్ లో టాప్ కంటెస్టెంట్ కి బయట డేంజర్ బెల్స్..??

వాస్తవం సినిమా: సీజన్ ఫోర్ స్టార్ట్ అయిన నాటి నుండి బిగ్ బాస్ హౌస్ లో గేమ్ బాగా ఆడుతున్న వారిలో వినబడుతున్న పేరు అఖిల్. ఫిజికల్ టాస్క్ లు అదే విధంగా ఎంటర్టైన్మెంట్ పరంగా బిగ్ బాస్ ఆడియన్స్ కి అఖిల్ ఫుల్ మీల్స్ పెట్టాడు అని చెప్పవచ్చు. కానీ గేమ్ చివరికి వచ్చేసరికి అఖిల్ వ్యవహరిస్తున్న తీరుపై బయట నెగిటివిటీ బాగా పెరిగి పోయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈవారం ఎలిమినేషన్ సమయంలో మోనాల్ పై అదేవిధంగా కెప్టెన్సీ టాస్క్ టైం లో కూడా అఖిల్ చాలా క్రూరంగా వ్యవహరించడంతో…అఖిల్ చివరికి వచ్చేసరికి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అనే డిస్కషన్ లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంటిలో ఉన్న వాతావరణం బట్టి చూస్తే అందరిలో కంటే అఖిల్ ఈ వారం బాగా నెగిటివ్ గా ప్రోజెక్ట్ అవ్వటం జరిగిందని బయట టాక్. దీంతో కచ్చితంగా అఖిల్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.