ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన నాని..!!

వాస్తవం సినిమా: న్యాచురల్ స్టార్ నాని తనదైన శైలిలో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. “అష్టా చమ్మా” సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన నాని… ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా లాక్ డౌన్ లో “వి” సినిమాని రిలీజ్ చేసిన నాని… ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “టక్ జగదీశ్” అనే సినిమా చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండా మరొక సినిమాని నాని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ అనే దర్శకుడి తో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేయడానికి నాని రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ కుర్రవాడి పాత్రలో నాని నటించనున్నట్లు ఫిలింనగర్ టాక్.

అంతేకాకుండా సినిమాలో హీరోయిన్ గా నజ్రియా, ఆమె కుటుంబ సభ్యులు బ్రాహ్మణులుగా నటిస్తూ నాని ఇంట్లో చేరుతారని, వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథ… కామెడీ తరహాలో ఉండే విధంగా దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే ఈ సినిమా “బలే బలే మగాడివోయ్” లాంటి కామెడీ జోనర్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.