తిరుపతి ఉప ఎన్నిక పై సంచలన వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు..!!

వాస్తవం ప్రతినిధి: తిరుపతి ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలలో తెలంగాణ బిజెపి గెలవడంతో ఇక్కడ కూడా అదే రీతిలో గెలవాలని ఏపీ బీజేపీ నేతలు సరికొత్త వ్యూహాలు వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చాలావరకు ఏపీ రాజకీయాలలో యాక్టివ్ పాలిటిక్స్ లో… పెద్దగా రాణించని పరిస్థితులు ఇటీవల దాపురించడం తో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు   ఏపీ రాజకీయవర్గాలలో ఎప్పటినుండో టాక్ నడుస్తుంది.

ఇదిలా ఉండగా తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి మేటర్ లోకి వెళ్తే జరగబోయే ఉప ఎన్నికలలో బిజెపి జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. అభ్యర్ది ఎవరు అయినా రెండు పార్టీలు బలపరుస్తాయని ఆయన అన్నారు. తెలంగాణలో దుబ్బాక మాదిరి తిరుపతిలో గెలవాలని వీర్రాజు అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాన్‌ రెసిడెన్షియల్‌ నేతగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవ చేశారు. అధికారం పోయిన తర్వాత రాష్ట్రాన్ని వదలిపెట్టి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉండడం విడ్డూరంగా ఉందన్నారు.