వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనా థర్డ్‌ వేవ్‌..ఈసారి పరిస్థితి ఊహించలేనంత దారుణం ఉంటుంది : WHO

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారి యూరప్‌ దేశాలను వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి.

ఇది ఇలా ఉండగా.. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధతను యూరప్‌ దేశాలు అసంపూర్తిగా వదిలేశాయని, అందుకే ఈ దుస్థితి దాపురించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతినిధి డేవిడ్‌ నబార్రో చెప్పారు. ఆయన తాజాగా స్విట్జర్లాండ్‌లో మీడియాతో మాట్లాడారు. యూరప్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలయ్యే ప్రమాదముందని డేవిడ్‌ అన్నారు. ఈసారి పరిస్థితి ఊహించలేనంత దారుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.