అమెరికా విదేశాంగమంత్రిగా బ్లింకెన్‌!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తన కేబినెట్‌లో ఎవరిని నియమించాలో నిర్ణయించారు. అధ్యక్ష ఎన్నికల్లో తనకు విదేశీ వ్యవహారాల విధానాల సలహాదారుడిగా సేవలందించిన ఆంటోనీ బ్లింకెన్‌ను అమెరికా విదేశాంగ మంత్రి పదవికి ఎంపిక చేశారు. అలాగే, అమెరికా మాజీ విదే శాంగ మంత్రి జాన్‌ కెర్రీని ప్రత్యేక ‘వాతావరణ మార్పుల రాయబారి’గా నియమించ నున్నట్లు ప్రకటన చేశారు.

ఈ ఏడాది భారత స్వాతంత్య్ర సంబరాల సమయంలో బైడెన్‌ బృందం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ సదస్సులో బ్లింకెన్‌ భారత్‌ పక్షాన మాట్లాడారు. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను బైడెన్‌ కోరుతున్నారన్నారు. భారత్‌పై అణుపరీక్షల సమయంలో విధించిన ఆంక్షల తొలగింపులో బైడెన్‌ చేసిన కృషిని గుర్తు చేశారు. అదేవిధంగా ఇరుదేశాల మధ్య సివిల్‌న్యూక్లియర్‌ డీల్‌ కుదరడంలో కూడా బైడెన్‌ కీలక పాత్ర పోషించారన్నారు. మరోవైపు ఐరాసలో లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ను నియమించాలని బైడెన్‌ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.