జాతీయ పార్టీ ల పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీల పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందని అదేవిధంగా గతంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా పతనం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రెండు జాతీయ పార్టీలు పరిపాలన విషయంలో విఫలమైనట్లు చెప్పటం తన కర్తవ్యం అని ఆయన అన్నారు. వీటికి ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అన్నారు. దేశంలో సంపదలను సృష్టించడంలో జాతీయ పార్టీలు విఫలం అయ్యాయని, కాంగ్రెస్, బిజెపిలపై ఆయన విమర్శలు కురిపించారు. తెలంగాణలో సంపదను సృష్టించామని, మరి దేశ వ్యాప్తంగా ఎందుకు జరగడం లేదని ఆయన అన్నారు.

మరో వైపు చైనా అద్బుతమైన ప్రగతి సాదించిందని ఆయన అన్నారు.దేశం కొత్త పంధాను చేపట్టాలని ఆయన అన్నారు. చిల్లర గా వ్యవహరించి, మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదని, ప్రజలకు ప్రగతి అందించాలని ఆయన అన్నారు. తానే ఈ విషయంలో చొరవ తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. కేంద్రం నవరత్నాలుగా పేరొందిన సంస్థలను కేంద్రం అమ్ముతోందని అన్నారు. దేశాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకు వెళుతున్నారని మండిపడ్డారు. జాతి పరిరక్షణ లో కూడా టిఆర్ఎస్ అగ్రబాగాన ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.