మహేష్ సినిమా విషయం గురించి క్లారిటీ ఇచ్చిన అనుష్క..!!

వాస్తవం సినిమా: గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలో అనుష్క హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. కామెడీ పరంగా సినిమా చాలా బాగున్నా మహేష్ లో ఉన్న కామెడీ హ్యూమర్ సరికొత్తగా త్రివిక్రమ్ చూపించినా కానీ సినిమా పెద్దగా ఆడలేదు.

ఇదిలా ఉండగా చాన్నాళ్ల తర్వాత మళ్లీ మహేష్ సినిమాలో అనుష్క నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో ఓ కీలక క్యారెక్టర్ లో అనుష్క నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ పాత్రలో అనుష్క రోల్ కనిపించనుందని ఓ వార్త వైరల్‌ అయింది. అయితే..

దీనిపై తాజాగా అనుష్క క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలో నిజం లేదని.. ఈ మూవీలో నటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. కాగా.. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ను హీరోయిన్‌గా నటించబోతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి గత శనివారం పూజా కార్యక్రమాలు అధికారికంగా స్టార్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు కూతురు సితార తో పాటు మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ పాల్గొనడం జరిగింది.