అనిల్ రావిపూడి దర్శకత్వం లో మరోసారి మహేష్ సినిమా..??

వాస్తవం సినిమా: ఇండస్ట్రీలో కామెడీ తరహాలో సినిమాలు చేస్తూ ఒక్క పరాజయం లేని దర్శకుడిగా అనిల్ రావిపూడి కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు. మహేష్ కెరీర్లోనే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది.

ఇదిలా ఉండగా ఇటీవల అనిల్ రావిపూడి తన బర్త్ డే సందర్భంగా మరోసారి మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు ఉంటుందని ప్రశ్న వస్తే దానికి డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చారు. మహేశ్ గారు అనిల్ అని పిలిస్తే చాలు.. నేను డోర్ తెరుచుకుని వెళ్లి ఆయన ముందు కూర్చుంటాను. ఆయన ఇంట్లో చెఫ్ స్నాక్స్ చేసి పెడతారు. అవి తింటూ ఆయనకు కథ చెప్పి సినిమా ఓకే చేయించుకుంటా. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి నేను రెడీ. ఆయన పిలిస్తే పరిగెత్తుకెళుతాను అంటూ ఎగ్జయిట్ అయ్యారు రావిపూడి.

ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా చేస్తున్నట్లు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఈ స్థాయిలో రావటానికి కారణం నేను చేసిన ప్రతి హీరో మరియు నిర్మాత వారు నా పై పెట్టుకున్న నమ్మకమే అని అందువల్లే ఇండస్ట్రీలో ఇంత విజయవంతంగా ప్రయాణం సాగింది అని అనిల్ రావిపూడి తెలిపారు.