వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు

వాస్తవం ప్రతినిధి: గత రెండురోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్‌ ధర మూడో రోజు కూడా పెరిగింది. డీజిల్‌ ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్‌లో ఆదివారం లీటరు పెట్రోల్‌ ధర 9 పైసలు పెరుగుదలతో రూ.84.73కు చేరింది. డీజిల్‌ ధర కూడా 21 పైసలు పెరుగుదలతో రూ.77.56కు ఎగసింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం ఇది వరుసగా మూడో రోజు. అమరావతిలో కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 8 పైసలు పెరుగుదలతో రూ.87.65కు చేరింది. డీజిల్‌ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.80.05కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్‌ ధర 8 పైసలు పెరుగుదలతో రూ.87.18కు చేరింది. డీజిల్‌ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.79.61కు ఎగసింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్‌ ధర పెరిగింది. 8 పైసలు పెరుగుదలతో రూ.81.46కు చేరింది. డీజిల్‌ ధర 19 పైసలు పెరుగుదలతో రూ.71.07కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్‌ ధర 7 పైసలు పెరుగుదలతో రూ.88.16 చేరింది. డీజిల్‌ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.77.54 ఎగసింది.