రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అధికారం మాకు లేదు.. ట్రంప్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌..!!

వాస్తవం ప్రతినిధి: డెమొక్ర‌టిట్ అధ్య‌క్ష అభ్య‌ర్థి జో బైడెన్ విజ‌యాన్ని స‌వాలు చేస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న ట్రంప్‌కు శ‌నివారం మ‌రో కోర్టు షాకిచ్చింది. పెన్సిల్వేనియాలో న‌మోదైన కోట్ల కొద్దీ ఓట్ల‌ను చెల్ల‌నివిగా ప్ర‌క‌టించ‌డానికి అక్క‌డి ఫెడ‌ర‌ల్ జ‌డ్జ్ నిరాక‌రించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అధికారం ఈ కోర్టుకు లేదు అని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జ‌డ్జ్ మాథ్యూ బ్రాన్ ఈ దావాను కొట్టేశారు.
ఇది ఒక్క ఓట‌రు కాదు రాష్ట్రంలోని అంద‌రి ఓటు హ‌క్కును ఉల్లంఘించిన‌ట్లే అవుతుంది. మ‌న ప్ర‌జ‌లు, చ‌ట్టాలు, సంస్థ‌లు ఇలాంటివి కోరుకోరు అని జ‌డ్జి బ్రాన్ త‌న తీర్పులో తేల్చి చెప్పారు. ఎన్నిక‌ల ఫ‌లితాల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ట్రంప్ శిబిరం ఇలాంటి 30 కోర్టు కేసుల‌ను కోల్పోవ‌డం లేదా విత్‌డ్రా చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.