కరోనా మరణాల కట్టడికి కొత్త ట్రీట్‌‌‌‌మెంట్ కనుగొన్న తెలంగాణ తేజం..!

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారిపై పోరుకు అమెరికాలోని తెలుగు శాస్త్రవేత్త, వరంగల్‌కు చెందిన డాక్టర్‌ కన్నెగంటి తిరుమలదేవి అస్త్రాలను సిద్ధం చేశారు. టెన్నెసీ రాష్ట్రంలోని సెయింట్‌ జూడ్‌ చిల్ర్డెన్స్‌ రిసెర్చ్‌ ఆస్పత్రి ఇమ్యునాలజీ విభాగం వైస్‌-చైర్‌ హోదాలో సేవలు అందిస్తున్న ఆమె నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ ఘనత సాధించింది.

తెలంగాణకు చెందిన భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త కన్నెగంటి తిరుమల దేవి గొప్ప ఆవిష్కరణ చేశారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కబళిస్తున్న కరోనా మహమ్మారికి కళ్లెం వేసేందుకు సమర్థ చికిత్స విధానాన్ని కనుగొన్నారు. కరోనా రోగులకు ప్రాణాంతకంగా పరిణమించే వాపు (ఇన్‌ఫ్లమేషన్‌), ఊపిరితిత్తులు దెబ్బతినడం, అవయవాల వైఫల్యాన్ని నిరోధించే మార్గాన్ని గుర్తించారు. ‘ఇన్‌ఫ్లమేటరీ సెల్‌ డెత్‌’ ఎలా జరుగుతుంది, దాన్ని ఏ విధంగా అడ్డుకోవచ్చన్నది కనుగొన్నారు. కొవిడ్‌-19తో ముడిపడి ఉన్న ‘హైపర్‌ ఇన్‌ఫ్లమేటరీ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌’.. కణజాలం దెబ్బతినేందుకు, భిన్న అవయవాల వైఫల్యానికి దారితీస్తున్నట్టు గుర్తించారు.

కరోనా వల్ల అవయవాలు ఫెయిల్ అయ్యేందుకు దారితీసే సెల్ డెత్ సిగ్నలింగ్ పాత్ వే గుట్టును పూర్తిగా తెలుసుకున్నది. ఈ సిగ్నలింగ్ పాత్ వేను అడ్డుకుంటే ఇమ్యూన్ సిస్టం మన అవయవాలను దెబ్బతీసేలా సిగ్నల్స్ ఇవ్వకుండా కట్ చేయొచ్చని.. దాంతో కరోనా వల్ల ప్రాణాలు పోకుండా కాపాడొచ్చని చెప్తున్నరు. కరోనాకు మాత్రమే కాకుండా సెప్సిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు ట్రీట్ మెంట్ చేసేందుకు కూడా వీరి స్ట్రాటజీతో వీలవుతుందని అంటున్నరు. ఈ ముప్పు తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడే పలు ఔషధాలను కూడా గుర్తించారు.

ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ స్పందించి వైర్‌స/బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు యాంటీబాడీలు, వివిధ రోగ నిరోధక కణాలను విడుదల చేయడం సహజ పరిణామమే. అయితే రోగ నిరోధక కణాలు ఇన్ఫెక్షన్‌ సోకిన ప్రదేశం, రోగకారక క్రిమికి సంబంధించిన సమాచారాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు విడుదల చేసే సిగ్నలింగ్‌ ప్రొటీన్లే సైటోకైన్లు. రోగ నిరోధక కణాలు ఎన్నో రకాల సైటోకైన్లను విడుదల చేస్తుంటాయి. అయితే తిరుమలదేవి నేతృత్వంలోని పరిశోధక బృందం ప్రత్యేకించి.. కొవిడ్‌-19 రోగులను