మరో భారత సంతతి మహిళకు జో బైడెన్ కీలక పదవి..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భారత సంతతికి చెందిన మరో మహిళకు కీలక పదవిని ​కేటాయించారు. ఇప్పటికే భారత ఎన్ఆర్ఐ కమలా హారిష్ అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపడుతుండగా, తాజాగా మరో మహిళనుకు యూఎస్ ఉన్నత స్థానం దక్కబోతోంది.

అమెరికాలో మరో ఇండియన్-అమెరికన్‌కు కీలక పదవి చేపట్టబోతున్నారు. కాబోయే అగ్రరాజ్య ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన మాలా అడిగా‌ను జో బైడెన్ శుక్రవారం నియమించారు. భార్య జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన మాలా అడిగాను నియమించారు. ఈమె గతంలోనూ జిల్‌ బైడెన్‌కు సీనియర్‌ సలహాదారుగా, బైడెన్‌- కమలా హ్యారిస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాలసీ సలహాదారుగానూ, బైడెన్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌గానూ సేవలందించారు. బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయం‍లోనూ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్‌కి మాలా డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత డిఫెన్స్‌లో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌కి సీనియర్‌ సలహాదారుగానూ సేవలందించారు.