నాగశౌర్య కు జోడీగా ప్ర‌ముఖ సింగర్

వాస్తవం ప్రతినిధి:టాలీవుడ్ యాక్ట‌ర్ నాగశౌర్య అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో ప్ర‌ముఖ సింగర్‌, న‌టి శిర్లే సెటియా తొలిసారి తెలుగు లో హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుంది. ప్రొడ‌క్ష‌న్ నంబర్ 4గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ రెమ్యున‌రేష‌న్ అంశం ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పాప్ సెల‌బ్రిటీ అయిన శిర్లే సెటియాకు మొద‌టి సినిమాలోనే రూ. 1కోటి పారితోషికంగా ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇంత మొత్తంలో రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం ఆస‌క్తిక‌ర విష‌య‌మేన‌ని చెప్పొచ్చు. హిందీలో మ‌స్కా చిత్రంలో న‌టించిన శిర్లే సెటియాకు ఇన్ స్టాగ్రామ్ లో 7 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీని నాగశౌర్య త‌ల్లిదండ్రులు ఉషా, శంక‌ర్ ములుపూరి నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ షురూ కానుంది. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.