ఓ వైపు కరోనా ..మరోవైపు చలితో వణికిపోతున్న ఢిల్లీ ప్రజలు

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఢిల్లీ ప్రజలు ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే మరో వైపు వాతావరణం వారికి సహకరించడం లేదు. ఢిల్లీలో 17 ఏళ్ల తర్వాత నవంబర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 6.9 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అంతకు ముందు 2003 నవంబర్‌లో అత్యల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.