త్వరలోనే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

వాస్తవం ప్రతినిధి: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు. ఈ సమావేశాలపై త్వరలోనే సర్కారు తేదీలు నిర్ణయిస్తుందని తెలిపారు.

కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే వర్షాకాల సమావేశాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. అలాగే, పార్లమెంట్‌ స్థాయీ సంఘాలు క్రమం తప్పకుండా సమావేశవుతున్నాయని చెప్పారు. త్వరలోనే సమావేశాల నిర్వహణపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ తేదీలను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలతోనూ ఇదే విషయంపై చర్చిస్తుందని వివరించారు.