ఏపీ సర్కార్ పంపిన ఫైల్ ని వెనక్కి పంపిన గవర్నర్

వాస్తవం ప్రతినిధి: వివిధ వర్సిటీలకు వైస్ చాన్సలర్ ల నియామకం కోసం ఏపీ సర్కార్ పంపిన దస్త్రాన్ని గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయకుండా వెనక్కు తిప్పిపంపారు. వీసీలను నియమించేందుకు పేర్లను ప్రతిపాదిస్తూ ఏపీ సర్కార్ పంపిన ఫైలును గవర్నర్ దాదాపు 20 రోజుల పాటు పెండింగ్ లో ఉంచి, చివరకు ఆమోద ముద్ర వేయకుండానే వెనక్కుపంపారు. జగన్ సర్కారు ఒక్కో వర్శిటీకి ఒక్కో పేరును మాత్రమే సిఫార్సు చేస్తూ పంపడం వల్లనే బిశ్వభూషణ్ ఫైల్ ను వెనక్కు పంపినట్లు తెలుస్తున్నది.